గోదావరి కాల్వలో మునిగి బాలుడు మృతి

UPDATED 19th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక అన్నపూర్ణమ్మ దేవాలయం వద్ద గోదావరి కాల్వలో మునిగి చందు(12) అనే బాలుడు మృతి చెందాడు. భక్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేయగా స్థానిక బలుసులపేటకు చెందిన చందు సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చాడని, గోదావరి కాల్వలో స్నానానికి దిగి నీట మునిగి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస నాయక్ తెలిపారు.        

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us