UPDATED 23rd AUGUST 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : శ్రావణమాసం నాల్గవ శుక్రవారం నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కుంకుమ పూజలు, అభిషేకాలతో భక్తిభావం ఉప్పొంగింది. పెద్దాపురం పట్టణంలో గల ప్రసిద్ధ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో సామూహిక వరలక్ష్మీ పూజలు వైభవంగా నిర్వహించారు. విశేష అలంకారంలో ఆలయ మండపంలో కొలువుదీరిన అమ్మవారికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజలు ఆచరించారు. ఈ పూజల్లో పాల్గొన్న మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, నెక్కంటి సాయిప్రసాద్ చేతుల మీదుగా లక్ష్మీదేవి రూపులను అందచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.







