UPDATED 13th APRIL 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: చెత్త నుంచి సంపద తయారీపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఇంఛార్జ్ ఎంపిడివో సి.హెచ్. జగ్గారావు అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలోని వర్మీ కంపోస్ట్ యార్డులో మండల మహిళా సమాఖ్య సభ్యులకు నిర్వహించిన శిక్షణలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతల నాగమహేశ్వరి, ఉప సర్పంచ్ పబ్బినీడి ఈశ్వరరావు, ఎపిఎంలు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







