ఆదిత్యలో ఘనంగా గ్రంధాలయ వారోత్సవ వేడుకలు

UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో గల వివిధ కళాశాలలకు చెందిన గ్రంధాలయ విభాగాల ఆధ్వర్యంలో జాతీయ గ్రంధాలయ వారోత్సవ వేడుకలు బుధవారం  ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి హాజరై గ్రంధాలయోద్యమ రూపకర్త అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయిలో గ్రంధాలయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన అయ్యంకి వెంకటరమణయ్య మన తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు వాసి కావడం మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఆదిత్య ప్రధాన గ్రంధాలయాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ 1919 నవంబర్ 14వ తేదీ జాతీయ పౌర గ్రంధాలయ సంఘ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకుని 1968 సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతీ సంవత్సరం నవంబర్ 14 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంధాలయ వారోత్సవాలను నిర్వహిస్తూ, పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తూ వస్తోందని అన్నారు. 1972లో భారత ప్రభుత్వం వెంకటరమణయ్య చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారని తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, చివరి రోజున విజేతలకు బహుమతులు  అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంగణంలో గల వివిధ కళాశాలల  ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, గ్రంధాలయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us