UPDATED 22nd AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మెగా ఫ్యామిలీ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సిరి మానసిక దివ్యాంగుల పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి(బాబు) పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఫాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎస్. ఉదయ కుమార్, అధ్యక్షుడు తుమ్మల ప్రసాద్, ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి సరోజ్ వాసు, జాయింట్ సెక్రటరీ బి. నానాజీ, ట్రెజరర్ ఎండి షఫియుల్లా, క్రేజీ బాయ్స్ సాయి, నాగేశ్వరరావు, దుర్గా, అల్లిమిల్లి శ్రీను, చమక్, తిక్కిరెడ్డి కాశీ, జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.







