అక్నూ వైస్ ఛాన్సలర్ కు ఘన సత్కారం

UPDATED 7th DECEMBER 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ కళాశాలల కరెస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ సమావేశం, అక్నూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు స్వాగత సత్కార సభ శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ సిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (భీమవరం)కు చెందిన సీనియర్ కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ అక్నూ పరిధిలో గల అన్ని డిగ్రీ కళాశాలలు మెరుగైన విద్యా ప్రమాణాలు పాటిస్తూ యూనివర్సిటీ అడుగుజాడలలో నడుస్తున్నాయని, విద్యా ప్రమాణాలు మెరుగుదలకు మావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. విద్యాధికులు, ఉన్నతభావాలు గల ఆదర్శనేత, ప్రకృతి ప్రేమికులు అయిన ప్రొఫెసర్ రామకృష్ణారావు పర్యవేక్షణలో అక్నూయూనివర్సిటీ రాబోవు రోజులలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కొనియాడారు. ఈ సమావేశంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అక్నూ నూతన వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావును ఘనంగా సన్మానించారు. అనంతరం సన్మాన గ్రహీత, వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ మెరుగైన విద్యను అందించడంలో అందరూ సహకరించాలని, నూతన ఆలోచన విధానంతో ఉన్నతమైన, నాణ్యమైన విద్యా విధానానికి అందరి సలహాలు, సూచనలను కోరుతున్నానని అన్నారు. అక్నూ మంచి ఉజ్వలమైన స్థాయికి చేరుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో అక్నూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. టెకీ, రెక్టార్ ప్రొఫెసర్ పి. సురేష్ వర్మ, పిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణ, మోడరన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ లైన్ జి.వి రావు, జిబిఆర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్(అనపర్తి) కరస్పాండెంట్ టి. ఆదిరెడ్డి, ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, వివిధ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us