UPDATED 27th MARCH 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: జై భారత్ నేషనల్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ పరిధిలోని స్థానిక సంపెంగతోటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయటానికి తమ పార్టీ కృషి చేస్తుందని, రాజకీయ నాటకాలతో అధికారం కోసం ప్రజలను మోసగిస్తున్న పార్టీలను ప్రజలు నమ్మొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ప్రతీ మహిళ ఆత్మగౌరవం, ఆర్థిక స్వాతంత్య్రంతో బతకాలన్నదే లక్ష్యమని, రాష్ట్రంలో ప్రతీ పౌరుడి జీవన ప్రమాణాలు రెట్టింపు అయ్యేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. అవినీతిరహిత సమాజ నిర్మాణం కోసం తమ పార్టీకి ప్రజలంతా మద్దత్తునివ్వాలని ఆయన కోరారు. అందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి తమ పార్టీ గుర్తు గాజులు గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి దొరబాబు, దాసరి చినరాంబాబు, సిద్దిరెడ్డి పాపారావు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







