UPDATED 4th JUNE 2019 THURSDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో స్వామి వివేకానంద వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గైట్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుని స్పూర్తితో విద్యార్థులందరూ చైతన్యవంతులు కావాలని, స్వశక్తితో ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద బోధనలు గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి ఎంవి సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వైడి శివప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







