UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 8:30 PM
సామర్లకోట: మహిళ మెడలో గొలుసు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్.ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 20న స్థానిక కొత్తూరు బలుసువారి వీధిలో ఒంటరిగా నడిచి వెళుతున్న గిడుతూరి నిర్మల అనే మహిళ మెడలో ఉన్న రెండున్నర కాసుల బంగారు గోలుసును దొంగిలించినట్లు ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేయగా ముత్యాల కృష్ణ అనే వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో సిబ్బంది ఎస్.లక్ష్మీకాంతం, పి.డి.సి.హెచ్. రాజు, ఎ.ఎస్.ఐ. వి. నాగేశ్వరరావు, కె. పాండురంగ, కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







