UPDATED 5th FEBRUARY 2020 WEDNESDAY 6:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో ప్రసిద్ధ దివ్య క్షేత్రంగా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి కన్నబాబు, శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ ముఖ్య అతిథులుగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రూ.కోటి యాభై లక్షల వ్యయంతో గ్రామ ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గూడాల రామకృష్ణ, కురసాల సత్యనారాయణ, కొప్పిశెట్టి గణేష్, గుడాల నానిబాబు, అర్చకులు సతీష్ కుమారాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.







