UPDATED 9th JUNE 2017 FRIDAY 9:00 PM
గోకవరం: డి ఫార్మసీ లో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జి.కొత్తపల్లి ఆదర్శ ఫార్మసీ కళాశాల విద్యార్థిని నక్కా హారిక రాష్ట్ర స్థాయిలో ప్రథమ రాంక్ సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ వి. కనకరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హారిక 1000 మార్కులకు 934 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తమ కళాశాల విద్యార్థులు వరుస విజయాలతో గత మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించారని ఆయన తెలిపారు. 2015 లో కె.సాయి ఫల్గుణి 938 మార్కులు, 2016 లో పి. సాయి సువర్ణ జగన్మయి 919 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ రాంక్ సాధించారని తెలిపారు. విద్యార్థిని హరికను సెక్రటరీ పి. నాగమణి, కో ఆర్డినేటర్లు శ్రీనివాస్, టి.శివరామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. దురైవేల్, అధ్యాపకులు కామేష్, సౌజన్య, కెవిఆర్ రాజు, అశ్విని, ఉష తదితరులు అభినందించారు.







