భవన నిర్మాణ కార్మికులు భిక్షాటన

UPDATED 11th NOVEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : ఇసుక కొరతతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ సెంటర్ వరకు సోమవారం భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలంటూ అధికారంలోకొచ్చిన ప్రభుత్వం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో చీకట్లను నింపిందని అన్నారు. నూతన ఇసుక పాలసీ అంటూ సహజ వనరులను అందుబాటులోకి లేకుండా వేలాది కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటించేలా చేసిందన్నారు. ఇసుక కొరత వల్ల కార్మికులు ఉపాధి లేక అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు రూ. పదివేలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బర్ల గోపాల్, పెనుపోతుల సత్తిబాబు, ప్రకృతి ఈశ్వరరావు, గరగ బాబురావు, గరగ సుబ్రమణ్యం, బాలం సత్తిబాబు, పసుపులేటి వీరబాబు, మిల్కీ సదక్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us