Updated 24 January 2022 Monday 16:10 PM
పట్నా (రెడ్ బీ న్యూస్): బిహార్ బక్సార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో కరోనా టీకాలు ప్రత్యక్షమయ్యాయి. రఘునాథ్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని డంపింగ్ ప్రదేశంలో కొవిడ్ టీకాలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున టీకాలు పడేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్తలో పడి ఉన్న టీకాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మేనేజర్ వినోద్ కుమార్ వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.







