UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు వి. హర్షవర్ధన్, కె. నిఖిత, వి. హారిక ఈ నెల 17,18 తేదీల్లో కాకినాడ జె.ఎన్.టి.యు నిర్వహించిన టెక్ ఫెస్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచారని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు నీటి నిల్వలను పసిగట్టి దానికి అనుగుణంగా ఆన్/ఆఫ్ చేసే ఆటోమేటివ్ వాటర్ లెవెల్ కంట్రోలర్, వికలాంగులు వారి చేతి కదలికలు ద్వారా సులభంగా నడిపే కుర్చీ హ్యాండ్ కంట్రోల్ బోట్ ప్రాజెక్టులు ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, తదితరులు అభినందించారు.







