ఆదిత్యలో మానవ వనరుల విభాగంలో ప్యానల్ చర్చ

UPDATED 11th AUGUST 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి:  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో శనివారం రోజున మానవ వనరుల విభాగంలో ప్యానెల్ చర్చను శనివారం నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సుగుణారెడ్డి మాట్లాడుతూ బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు మానవవనరుల మూల్యాంకనం ఎంతో ముఖ్యమని, దానిని మూల్యాంకనం చేయడానికి వివిధ రకాల పద్ధతులైన ర్యాంకింగ్,360 డిగ్రీల విధానాలు ఎంతో ఉపయోగపడతాయని, మానవ వనరుల విభాగం సామర్ధ్యం ఆధారంగా సంస్థలు తమ మనుగడను కొనసాగిస్తాయని సూచించారు. ప్రస్తుతం వ్యాపార రంగాలలో రాణించాలంటే ఈ విభాగంలో ఉత్పత్తి, సేవారంగాలు మానవ వనరులతో సమానంగా కలిసి పనిచేయాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ నిలుపుదల, వ్యూహాలు ఈ రంగంలో ఎంతో ముఖ్యమైనవని, సంస్థలో ఎప్పటికప్పుడు ప్రాధాన్యత గల నిర్ణయాలను తీసుకొని వాటిని వ్యాపార, వాణిజ్య రంగాలలో అన్వయించినపుడు ఆయా సంస్థలకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.  కళాశాల అధ్యాపకులు డాక్టర్ జి. సుమ, డి. దీప, బి. సౌజన్య పాల్గొన్న ఈ ప్యానల్ చర్చలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ప్రకటించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us