UPDATED 4th APRIL 2022 MONDAY 6:00 PM
Kakinada District Joint Collector ilakkiya : జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన ఎస్.ఇలాక్కియా సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను పలువురు జిల్లా స్థాయి అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యిత వర్గాల పేదలకు సమగ్రంగా సత్వరం అందేలా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.







