UPDATED 15th OCTOBER 2022 SATURDAY 07:00 PM
ATM Cards : రోడ్డుపై గుట్టలుగా సగం కాలిన ఏటీఎం కార్డులు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో శనివారం కలకలం రేపాయి. స్థానిక రాజుగారి వీధిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంకు) పక్కనే సగం కాలిపోయిన ఏటీఎం కార్డులు దర్శనమిచ్చాయి. అటువైపుగా వెళ్లినవారు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గుట్టలుగా పడి సగం కాలిపోయి ఉన్న ఆ కార్డులు ఆంధ్రాబ్యాంకు పేరుతో ఉండడంతో బ్యాంకు ఖాతాదారులు షాక్ కు గురయ్యారు..
బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా కార్డులు ఇలా రోడ్డుపై ఎందుకు పాడేశారని పలు రకాలుగా చర్చించుకున్నారు. ఈ విషయంపై యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ రాయ్ ని వివరణ కోరగా ఆంధ్రాబ్యాంకు ప్రస్తుతం యూనియన్ బ్యాంకుగా మారిందని ఆంధ్రాబ్యాంకు పేరుతో ఉన్న ఆ కార్డులు పనిచేయవని, అందుకే వాటిని పాడేశామని, ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.







