జిల్లాస్థాయి కార్టూన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

UPDATED 4th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో స్దానిక బచ్చు ఫౌండేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థి గున్నాబత్తుల రాజు విశేష ప్రతిభ కనబరిచి డీఈవో  అబ్రహాం చేతుల మీదుగా బహుమతి అందుకున్నట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామర్లకోట మున్సిపల్ కమీషనర్ నాగేంద్రకుమార్ విద్యార్థి, హెచ్ఎంను  అభినందించారు. ఇటీవల పదోతరగతి ఫలితాల్లో పట్టణ స్థాయిలో 98 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానం సాధించడంతో పాటు కో కరిక్యులర్ కృత్యాల్లో కూడా విద్యార్థులు ప్రతిభ చూపి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని కమీషనర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని మెమెంటో తో కమీషనర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె. శ్రీనివాస్, సిహెచ్ భద్రావతి,  తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us