India : భారత్ కు వచ్చే పర్యాటకులకు గుడ్​న్యూస్.. ఈ-టూరిస్ట్ వీసాలపై నిషేధం ఎత్తివేత

UPDATED 16th MARCH 2022 WEDNESDAY 04:00 PM

Government of India : భారత్ కు వచ్చే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ అందించింది. ఈ-టూరిస్ట్ వీసాలపై నిషేధం ఎత్తివేసింది. 156 దేశాల పౌరులకు జారీ చేసే ఈ-టూరిస్ట్ వీసాలను కేంద్రం పునరుద్ధరించింది.కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఈ-టూరిస్ట్ వీసాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ-టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని దేశాల పౌరుల సాధారణ వీసాలు, అమెరికా-జపాన్ దేశాల పౌరులకు పదేళ్ల పర్యాటక వీసాలపై ఆంక్షలు తొలగిస్తున్నామని కేంద్రం తెలిపింది.

కొత్త వీసాలు సైతం జారీ చేయడం ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐదేళ్ల కాలపరిమితి ఉండి చెల్లుబాటు అయ్యే ఈ-టూరిస్ట్ వీసా హోల్డర్లకు దేశంలోకి అనుమతి ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us