ఆదిత్య ఎన్.ఎస్.ఎస్ బృందంచే వ్యక్తిగత మరుగుదొడ్లుపై అవగాహన

UPDATED 26th DECEMBER 2017 TUESDAY 6:00 PM

రంగంపేట: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా రంగంపేట మండలం రంగంపేట, వడిశలేరు గ్రామాలలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ఎన్.ఎస్.ఎస్. బృందం ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించిన సమాచారం ప్రకారం గ్రామాల్లో 31 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు కట్టుకోలేదని, కట్టినవారు వాటిని వినియోగించకుండా స్టోర్ రూములుగా ఉపయోగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సహాయంతో నిర్మించుకోవచ్చు అనే విషయం చాలా కుటుంబాల వారికి తెలియదని తమ విద్యార్థుల సర్వేలో తెలిసిందని ఆయన తెలిపారు. బహిరంగ మలవిసర్జన వల్ల నీరు, గాలి కలుషితమై అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ భాస్కరరావు, 60 మంది విద్యార్దుల బృందం పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us