అల్లూరి సేవలు స్ఫూర్తిదాయకం

UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు సేవలు స్ఫూర్తిదాయకమని తహసీల్దార్ ఎల్. శివకుమార్ అన్నారు. అల్లూరి 121వ జయంతిని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన అల్లూరి సీతారామరాజును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన్యం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆంగ్లేయులను ఎదురించిన ధీరోదత్తుడన్నారు. యుక్త వయస్సులోనే దేశభక్తిని నింపుకున్న ఆయన తుది శ్వాస విడిచే వరకు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us