UPDATED 15th OCTOBER 2018 MONDAY 9:00 PM
రాజానగరం: ప్రజాసేవలో తమ ఆసుపత్రి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి అన్నారు. స్థానిక కెఎల్ఆర్ దంత వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ప్రతీరోజు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తామని ఆమె చెప్పారు. సాధారణ సమయాల్లో కూడా ఆస్పత్రిలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, కోశాధికారి కె. సింధు, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.







