జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది

* రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని సిబ్బందికి ఆదేశం
* జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ 
UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 6:30 PM
పెద్దాపురం: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషనును ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, గత ఏడాదితో పోల్చితే ఈఏడాది క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. అలాగే రహదారుల్లో ప్రమాదాలు సైతం బాగా తగ్గినట్లు చెప్పారు. ఈవిషయంలో పోలీసు శాఖ మిగిలిన శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే అతివేగంగా వెళ్లకుండా వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణం చేయాలని సూచన చేశారు. ప్రధాన కూడళ్లల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఇండికేటర్లను ఏర్పాటు చేయడం జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే సిసి కెమేరాల ద్వారా నిఘాను పర్యవేక్షించడం జరుగుతున్నట్లు చెప్పారు. ఆలాగే అవసరమైన సిబ్బందిని నియమించడం జరుగుతుదన్నారు. త్వరలో వినాయకచవితి సమీపిస్తున్న తరుణంలో పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత కమిటీ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయకచవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చిలకా వెంకట రామారావు, సిఐ వై.ఆర్.కె శ్రీనివాస్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us