ఆదిత్య సహాయ ఆచార్యులకు డాక్టరేట్

UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు  బ్యాచలర్ ఆఫ్ సైన్స్ సహాయ ఆచార్యులు గిరజాల చిన్నారామ్ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి పట్టా డాక్టరేట్ పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో సహాయ ఆచార్యులుగా అత్యుత్తమ సేవలందిస్తూ, నిరంతర కృషితో ఉన్నత చదువులు అభ్యసించారని, ఆయన సమర్పించిన "లేడ్ బీష్మత్ ఫాస్పేట్ గాజు పదార్ధాలు కాంతి ఉద్గార ధర్మాలు, వాటి  ఉపయోగాలు, విశ్లేషణ మీద సిద్ధాంత వ్యాసంకు ఈ డాక్టరేట్ పొందారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారాంను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ & ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్  ఏ. రామకృష్ణారావు, వివిధ విభాగాధిపతులు, తదితరులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us