ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని కొందరు చెబుతుంటారు. ఇప్పుడు ఆ మాట నిజమని కొందరు శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరసన్ను నిరోధించే ఫైటో కెమికల్స్ కలిగిన మొక్కను హిమాలయాల్లో గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), దిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (ఐసీజీ ఈబీ) సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించాయి. హిమాలయాల్లోని 'రోడోడెండ్రాన్ అర్బోరియం' అనే మొక్క పూ రేకుల్లో కొవిడ్-19 చికిత్సలో కీలకమైన ఫైటో కెమికల్స్ ను పరిశోధకులు గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా 'బురాన్డ్'గా పిలుస్తారని తెలిపారు. ఈ ఫైటోకెమికల్స్ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. కాగా 'బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్' జర్నల్ లో ఇటీవలే ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఐఐటీ మండి అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి ఈ సందర్భంగా మాట్లాడారు. 'వైరస్ పై శరీరానికి పోరాడే శక్తిని ఇచ్చే పద్ధతుల్లో వ్యాక్సీన్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా టీకాయేతర ఔషధాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ఔషధాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీర కణాల్లోని గ్రహకాలను బంధిస్తాయి. వైరస్ ప్రవేశించకుండా నిరోధిస్తాయి. అలాగే.. శరీరంలో వైరస్ ప్రవేశించినా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. వివిధ రకాల చికిత్సలపై అధ్యయనం చేశాక, మొక్కల నుంచి తీసుకున్న రసాయనాలు ఫైటో కెమికల్స్.. వైరసను నిరోధించటంలో కీలకంగా మారుతున్నాయని తెలిసింది' అని పేర్కొన్నారు. హిమాలయాల్లో దొరికే బురాన్లో మొక్కల పూ రేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికత్సల్లో వినియోగిస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. ఈ పూ రేకుల్లో వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా యాంటీవైరల్ గుణాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







