UPDATED 10th JANUARY 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు క్రాస్ ట్రైక్ జాతీయస్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన మెకానికల్ విద్యార్థి నట్రాక్స్ నందు పీతంపూర్, మధ్యప్రదేశ్ లో జరిగిన క్రాస్ ట్రైక్ జాతీయస్థాయి పోటీల్లో ఇన్నోవేషన్ విభాగంలో కస్టమ్ గేర్ బాక్స్ కు, మెకానికల్ తృతీయ సంవత్సరం విద్యార్థులు సొంతంగా రూపొందించిన ట్రై సైకిల్ ( హైబ్రిడ్ మెకానికల్, ఎలక్ట్రికల్) కు రూ.పదివేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం గెలుపొందినట్లు ఆయన తెలిపారు. జాతీయస్థాయిలో ఈ విభాగంలో 20 కళాశాలలకు చెందిన విద్యార్థులతో పోటీపడి విజయం సాధించారన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, మెకానికల్ విభాగాధిపతి వై.కె.ఎస్. సుబ్బారావు, అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.







