రామదాస్ పేపర్ మిల్లును సందర్శించిన ఆదిత్య విద్యార్థులు

UPDATED 6th AUGUST 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రథమ సంవత్సరం ఎంబిఏ విద్యార్థులు కడియం సమీపంలో గల రామదాస్ పేపర్ మిల్లును సందర్శించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. విద్యార్థులు పరిశ్రమలో పేపర్ తయారయ్యే విధానం, తదితర పద్ధతులు గురించి స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమలు సందర్శించడం వల్ల  పారిశ్రామికతలు గురించి తెలుసుకొనే వీలు కలుగుతుందని, అలాగే పారిశ్రామికవేత్తలతో చర్చిండం వల్ల ఖర్చు, రాబడులకు సంబంధించి బడ్జెట్లు తయారుచేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్ మెంట్ విభాగాధికారిణి డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక బృందం ఎం. గోపివర్ధన్ రెడ్డి, వి. సురేంద్ర, టి.ఎస్.ఎస్. స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us