UPDATED 14th DECEMBER 2018 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో శుక్రవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాయత్రి విద్యాపరిషత్ పిజి కళాశాల (వైజాగ్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. శ్యామలరావు హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందించారు. విద్యార్థులు కష్టపడే స్వభావం అలవర్చుకోవాలని, అనేక అంశాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఫైనాన్స్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, నిరంతరం తెలియని విషయాలను నేర్చుకొంటూ దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు సాగాలని, నిరంతరం పోటీతత్వం అలవర్చుకోవాలని అన్నారు. అకౌంటింగ్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక తయారీ, తప్పుల సవరణ, దిద్దుబాటు చర్యలు వంటి తదితర అంశాలపై బిబిఎ విద్యార్థులకు అవగాహన కల్పించారు. డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి నిష్ణాతులైన అధ్యాపకుల శిక్షణా తరగతుల ద్వారా విద్యార్థులు పూర్తి శిక్షణ పొంది పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







