UPDATED 11th JANUARY 2019 FRIDAY 6:15 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్, కేంద్ర మానవవనరుల శాఖ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో మేధోసంపత్తి హక్కులపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్. రంజిత్ పాల్గొని మేధోసంపత్తి హక్కులు గురించి వివరించారు. మన మేధస్సుతో ఒక నూతన ఆవిష్కరణ కావించి దానిపై సర్వ హక్కులు మనకే కలిగి ఉండే విధంగా పొందే విధానాన్ని పేటెంట్ హక్కు అంటారని అన్నారు. నేడు భారతదేశం ఆర్ధిక వ్యవస్థకు మూలాధారంగా నూతన ఉత్పత్తులు వాటి ఎగుమతులుపై ఆధారపడి ఉందని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు చేయవలసిన ఆవశ్యకత, వాటిపై హక్కులు పొందే విధానం గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ శాఖల విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







