UPDATED 31st JULY 2017 MONDAY 6:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో త్రివర్ణ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన ఎన్. సతీష్ నవోదయలో 9 వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ తోటకూర వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ విద్యాబోధనతో పాటు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పోటీ పరీక్షలకు సమాయత్తపరచడం తమ పాఠశాల ప్రత్యేకత అన్నారు. గత మూడు సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు నవోదయ నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధిస్తూ వస్తున్నారని తెలిపారు. నవోదయకు ఎంపికైన విద్యార్థిని ప్రిన్సిపాల్ కె. కృష్ణారావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.







