నూకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం

UPDATED 5th MAY 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: జాతర మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి  దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us