మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

UPDATED 26th DECEMBER 2017 TUESDAY 6:30 PM

పెద్దాపురం: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ వి. విశ్వేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ గ్రౌండ్స్ లో డివిజన్లోని తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బందితో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ట్రయిల్ రన్ లో మంగళవారం పాల్గొని మాట్లాడారు. త్వరలో కాకినాడలో జరగబోవు రెవిన్యూ క్రీడోత్సవాలలో పాల్గొనేందుకు డివిజన్ పరిధిలో గల పన్నెండు మండలాల్లోని రెవిన్యూ సిబ్బంది సిద్దమైనట్లు ఆయన తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, చెస్, లాంగ్ జంప్, తదితర క్రీడల్లో ఆర్.డి.వో స్థాయి నుంచి వి.ఆర్.ఏ. వరకు ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు ఒక రోజు శిక్షణ తీసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ ఏ. మల్లికార్జున చొరవతో ఈ క్రీడోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us