UPDATED 11th MARCH 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: పోలియో రహిత సమాజానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని వేట్లపాలెం పి.హెచ్.సిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో బారి నుంచి చిన్నారులను కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ల విజయలక్ష్మి, ఉప సర్పంచ్ వల్లూరి శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్ నాయక్, గుమ్మళ్ల రామకృష్ణ, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, పెద్దాపురం ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, తదితరులు పాల్గొన్నారు .







