UPDATED 28th JULY 2022 THURSDAY 04:00 PM
మండపేట (రెడ్ బీ న్యూస్) : డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహనా కార్యక్రమాన్ని మండపేట పట్టణంలో స్వస్థా ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గురువారం నిర్వహించారు. ద్వారపూడి, అంగర, కపిలేశ్వరపురం, మండపేట అర్బన్ ఎం.ఎల్ హెచ్.పీలు, సచివాలయ ఆరోగ్యమిత్రాలు ఈ అవగాహనా సదస్సుకు హాజరయ్యారు. ట్రైనింగ్ ప్రోగ్రామర్ (టీవోటీ) గుబ్బల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ తేజాక్షి హాజరై మాట్లాడారు.
ఆరోగ్యశ్రీ పరిధిలో 2446 వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఎంతో ఖరీదు అయిన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై క్షేత్రస్థాయిలో మరింతగా అవగాహనా కల్పించాలన్నారు. రోగి చికిత్స పొందిన తరువాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే రూ. ఐదు వేలు ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందని తెలియచేశారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకంపై మరింతగా అవగాహనా కల్పించారు. ఈకార్యక్రమంలో అరోగ్యమిత్రాలు కళ్యాణి, తనూజ, సూర్యకళ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.







