బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఇండియాగా "ఆదిత్య"

UPDATED 23rd SEPTEMBER 2019 MONDAY 9:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హ్యూమానిటీస్ అండ్ బేసిక్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వీరవిల్లి సూర్యనారాయణ క్యాంపస్ అంబాసిడర్, సిటీ కోఆర్డినేటరుగా ఐ.ఏ.ఆర్.సి. సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సులో శిక్షణ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో 561 మంది ఉతీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందారు. ఈ కోర్సును దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించినందుకు ప్రశంసిస్తూ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలను బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా అవార్డు ప్రధానం చేసి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సూర్యనారాయణ తమ సంస్థ పేరును జాతీయ స్థాయిలో గౌరవాన్ని పెంచారని అన్నారు. ఈ సందర్బంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు డాక్టర్ వీరవల్లిని అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us