UPDATED 31st OCTOBER 2017 TUESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో భారత ప్రథమ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను మంగళవారం కళాశాల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం మనం - మన కోసం దేశం అన్న భావన ప్రతీ ఒక్కరిలో ఉండాలని, ఉక్కు సంకల్పంతో సమైక్యంగా పోరాడాలన్నారు. ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నా మనమంతా భారతీయులం అనే భావన మరువకూడదన్నారు. అనంతరం సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, గ్రంథాలయ అధికారి కె. అశోక్ కుమార్, సహాయ గ్రంథాలయాధికారి సి. హెచ్. వేణు, తదితరులు పాల్గొన్నారు.







