దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021‌: మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ, రైతు భరోసా) సుమిత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన జేసీలు కీర్తి, భార్గవ్‌తేజతో కలిసి వర్చువల్‌ విధానంలో సబ్‌ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రమాణాలూ సక్రమంగా ఉన్న ధాన్యంతో పాటు, రంగుమారినవి సేకరించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయాలన్నారు. రానున్న 20 రోజులు కీలకమని, పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టాలని, రైతులకు కనీస మద్ధతు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఫీవర్‌ సర్వే, సచివాలయాలు, స్పందన అర్జీలు, బయోమెట్రిక్‌ హాజరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై జేసీ కీర్తి సమీక్షించారు. జగనన్న తోడు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, లేఔట్ల అభివృద్ధి, ఓటీఎస్‌పై జేసీ భార్గవ్‌తేజ సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, సీపీవో త్రినాథ్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, డీఎస్‌వో ప్రసాదరావు, వ్యవసాయశాఖ డీడీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us