UPDATED 21st JANUARY 2020 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణంలో 31 వార్డుల పరిధిలో 41,198 మంది ఓటర్లు ఉన్నారని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఓటర్ల జాబితాలను పరిశీలన నిమిత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, వీటిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈనెల 23వ తేదీలోగా తమ కార్యాలయంలో తెలియచేయాలని ఆయన తెలిపారు.







