UPDATED 8th JULY 2020 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రిగా రాజశేఖరరెడ్డి అనేక అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







