UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ క్రిస్టియన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 72వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, పలివెల సరోజనరావు, డేవిడ్ రాజు, ప్రసాద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







