ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

UPDATED 24th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్, మున్సిపల్ కమీషనర్ సి హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బిఎల్వోలకు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటర్లుగా గుర్తింపుపడతారని, అలాంటి వారిని ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వారికి  తెలియజేయాలని అన్నారు. కొత్త ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, పట్టణ పరిధిలోని అర్హులైన ప్రతీ వ్యక్తిని 31-10-2018 లోపు ఓటరుగా నమోదుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా బిఎల్వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us