UPDATED 17th SEPTEMBER 2019 TUESDAY 7:00 PM
యానాం(రెడ్ బీ న్యూస్): ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా యానాంలో గల సెల్ డమ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానం పుస్తక జ్ఞానం కంటే ఎంతో మేలని, అందుకే విద్యార్థులకు పారిశ్రామిక సంస్థల ద్వారా మెరుగైన ప్రత్యక్ష జ్ఞానం అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే యానాం పరిసర గ్రామం కోరంగిలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్లకార్డుల పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామ వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ అధ్యాపక సిబ్బంది టి. ఉదయకుమార్, టి. ప్రశాంతి, ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ ఎ. కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.







