UPDATED 10th JANUARY 2020 FRIDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్లబ్ ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ఈ క్లబ్ ఆధ్వర్యంలో వివరించడం జరుగుతుందని, తద్వారా దేశ సమగ్ర అభివృద్ధిలో విద్యార్థులు పాల్గొనేలా తయారుచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. రంగోలి, భోగి మంటలతో కళాశాల ప్రాంగణం ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకొంది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు







