* కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు
* దివిలి కిట్స్ లో ఉచిత దంత వైద్య శిబిరం
UPDATED 9th MARCH 2020 MONDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): దంతాల సంరక్షణ పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం మండలంలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ సేవా శిబిరంలో భాగంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దంతాల సంరక్షణలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, దంత వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను తప్పక పాటించాలని ఆయన అన్నారు. ఈ శిబిరంలో కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల (రాజానగరం)కు చెందిన వైద్యుల బృందం సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, ఏవో కెఆర్ సందీప్, ఏసీవో పెదకాపు, ఈవో జెన్నిబాబు, వైద్యులు డాక్టర్ అన్వేష్, కృష్ణ, చైతన్యరాం, శాంతిప్రియ, సంధ్య, ప్రియదర్శిని, శ్రావ్య, ఆసి, ఫణీంద్ర, పిఆర్ఓ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







