జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలు

UPDATED 31st JULY 2019 WEDNESDAY 6:00 PM

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే నిర్ణయంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో గల 56,58,045 జనాభాకు అనుగుణంగా 1271 గ్రామ సచివాలయాలు ఏర్పాటును బుధవారం అధికారులు ఖరారు చేశారు. దీనిలో భాగంగా అమలాపురం డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో 336, కాకినాడ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో 190, పెద్దాపురం డివిజన్ పరిధిలో గల 12 మండలాల్లోని 251, రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గల 7 మండలాల్లో 183, రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల 8 మండలాల్లో 169, రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 ఏజెన్సీ మండలాలలకు 96, ఎటపాక డివిజన్ పరిధిలోని 4 విలీన మండలాలకు 46 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us