గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ సూచించారు. మండలంలోని బయనపల్లి పంచాయతీ ఉమ్మెత్త గ్రామంలో గృహ నిర్మాణ లబ్ధిదారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నగదు చెల్లిస్తే గృహ నిర్మాణ సమయంలో ఇచ్చిన అప్పు పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆ ఇంటిపై లబ్ధిదారులకు పూర్తి హక్కు కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సూరిబాబు, వీఆర్వో రాజమణి, వెల్ఫేర్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరకృష్ణ, పండు దొర తదితరులు పాల్గోన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







