సింగంపల్లిలో ఆదిత్య విద్యార్థుల కార్యక్రమాలు

UPDATED 29th JULY 2018 SUNDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుమారు 60మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 100గంటల పాటు గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. స్వచ్ఛభారత్ లో భాగంగా పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించడం, పొడి, తడి చెత్తలను వేరుచేయుట, మొక్కల పెంపకం, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు స్వచ్ఛభారత్ పై అవగాహన పెంచేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ , ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ పి. శివకుమార్, ఆర్. జ్ఞానవర్జిన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us