* రాక్ సిరమిక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ యాదవ్
* ముగిసిన జాతీయ భద్రతా వారోత్సవాలు
UPDATED 10th MARCH 2020 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కార్మికుల భద్రతకు ఆధునిక సాంకేతిక పద్ధతులు జోడించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాక్ సిరమిక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక రాక్ సిరామిక్స్ లో నిర్వహిస్తున్న 49వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాక్ సిరమిక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ
ప్రతీ కార్మికుడు క్షేమంగా ఉండాలని, ఎల్లవేళలా భద్రతతో విధులు నిర్వహించాలని అన్నారు. భద్రతాధికారి పి. బాలాజీ మాట్లాడుతూ కార్మికులు, సిబ్బంది సమిష్టిగా పనిచేసి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్మికులకు భద్రతపై అవగాహన కోసం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వేర్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ స్వామినాథన్, టైల్స్ డివిజన్ డీజీఎం అక్బర్ భాషా, ఏజీఎం అనిల్ దహియా, అకౌంట్స్ డీజీఎం నటరాజ్, ఎస్.కె. సాహూ, విజిఎస్ కుమార్, సిహెచ్ భాస్కర్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు







