* జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
UPDATED 13th JUNE 2020 SATURDAY 10:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్):జిల్లాలో నూతన ఇసుక విధానం ద్వారా వినియోగదారులు తమకు దగ్గరలో వున్న గ్రామ సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకుంటే ఇంటివద్దకే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. స్థానిక కలక్టర్ కార్యాలయం వివేకనంద హాలులో నిర్వహించిన విలేఖరుల సమావేశం లో శనివారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలకు వెళ్లి ఇసుకను బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఇసుక దొరకదేమో అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, డిమాండ్ కు అనుగుణంగా ఇసుక సప్లయి చేయడం జరుగుతుందని అన్నారు. రోజువారీ వచ్చిన ఆర్డర్లను పరిగణలోనికి తీసుకుని నియోజక వర్గాల వారిగా డోర్ డెలివరీ, బల్క్ ఆర్డరులకు ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఇసుక బుక్స్ చేసుకున్న మూడు రోజులు వ్యవధిలోనే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఇసుక బుకింగ్ కోసం ప్రజలు తమ దగ్గరలో ఉన్న సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని, మొబైల్ ఫోన్లు ద్వారా గాని, తమ సొంత కంప్యూటర్ల ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. బల్క్ బుకింగ్ సంబంధించి ప్రజలు జాయింట్ కలక్టర్ అప్రోవల్ తో ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రస్తుతం 7 స్టాక్ ఫాయింట్లలో 14లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, . అదే విధంగా ఇసుక లభ్యమైయ్యే కాలువ,నదుల నుంచి ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల ప్రజలు వారి అవసరాల కోసం ఉచితంగా ఎడ్ల బండ్లలో ఇసుక తీసుకుని వెళ్లవచ్చునని తెలిపారు. ఇందు కోసం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇసుకకు సంబంధించిన విషయాలు, అగ్రిమెంట్ల కోసం ఇక నుంచి విజయవాడ వెళ్లవలసిన పనిలేదని, జిల్లా కలక్టర్ కార్యాలయం నుంచే అన్ని జరుగుతాయన్నారు. ప్రజలు ఇక మీదట బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధర చెల్లించి ఇసుక కొనాల్సిన పనిలేదని, బ్లాక్ మార్కెట్ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనికి సంబంధించి ఎస్ఈబి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేసులు నమోదు చేస్తున్నారని ఆయన తెలిపారు.







