అక్టోబర్ 12 న ఆదిత్యలో క్యాంపస్ డ్రైవ్

UPDATED 10th OCTOBER 2017 TUESDAY 10:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ కంపెనీ ఎప్ట్రానిక్స్ ఈ నెల 12 న క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. 2017 -18 విద్యా సంవత్సరంలో బిటెక్ ఫైనల్ ఇయర్ ఈఈఈ, ఈసీఈ, సి ఎస్ ఈ, ఐటి, ఎంసిఏ చదువుతున్న విద్యార్థులు 65 శాతం మార్కులతో ఎటువంటి బ్యాక్ లాగ్స్ లేని విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. సాఫ్ట్ వేర్ ట్రైనీ ఇంజనీర్, ఎంబెడెడ్ ట్రైనీగా విజయవాడలో పనిచేయుటకు వ్రాత పరీక్ష, హెచ్ ఆర్, టెక్నికల్ రౌండ్స్, టెక్నికల్ ఫైనల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నాలుగు నెలలు నుంచి ఆరు నెలలు పాటు శిక్షణ పొందవలసి ఉంటుందని, వీరికి రూ.2.40 లక్షలు నుంచి రూ. 4 లక్షలు వరకు వార్షిక వేతనం లభిస్తుందన్నారు. అర్హత గల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్లేస్ మెంట్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us